Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back See My Guestbook Sign My Guestbook

Topic 9

The text below is in Telugu Language - My Mother Tongue - One of the many Bharatian languages and the most spoken language in India after Hindi. If you are on Windows XP then you should be able to see it correctly as Windows XP ships with Unicode fonts (Gautami) for all languages. If you are not able to see the fonts correctly, then please install the Unicode fonts for Telugu. It is very easy.

Mostly used fonts for Telugu are Gautami, Arial Unicode MS, Free Serif, Saraswati5, Pothana2000, Akshar Unicode. If you want to download all fonts together then click here (Zip file). It is very easy to install them. If you need help in installing them Click here. Otherwise click here to see from where to get these fonts individually.

శ్రీ శ్రీ - మహాప్రస్థానం
Sri Sri - Mahaaprasthanam


మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పై పైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ,
పదండి పోదాం,
వినబడలేదా మరోప్రపంచపు జలపాతం?

దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు గడచీ,
కోటలన్నిటిని దాటండి!

నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు, పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పై పైకి!

ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
"హరోం! హరోం! హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!

మరో ప్రపంచం, మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది!
పదండి ముందుకు, పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హొరెత్తండీ!
భావవేగమున ప్రసారించండి!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!

పదండి, పదండి,
పదండి ముందుకు,
కనబడలేదా మరో ప్రపంచపు
కణ కణ మండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మెరువులు
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!

శివసముద్రము, నయాగరావలె
ఉరకండీ, ఉరకండీ ముందుకు
పదండి ముందుకు, పదండి త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ, రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగభుగలు?
-శ్రీ శ్రీ

-V Rama Aravind (Compiled By), 09/08/2005.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me