Funnotes Logo
Home Sai Satcharitra Talapatram

ఫారెన్ లో ఉగాది పచ్చడి

Ugadi Chutney (Pachadi) in Foreign
[BACK]

ఆ రోజు ఉగాది. సర్వజిత్ నామ సంవత్సర శుభారంభం. తేదీ ౨౦-౦౩-౨౦౦౭ (20-03-2007). ఇంటిదగ్గర ఉన్నట్టయితే నోరూరించే ఉగాది పచ్చడి తినేవాడ్ని, ఈ టీవి లో గాని జెమిని టీవి లో గాని ఏదోఒక సినిమానో, పాటలో చుసుకుంటూ. కాని ఏం చెయ్యను. ఇంటిదగ్గర లేను. ఉండేది ఇంగ్లాండ్లో. ఒక్క రోజు కోసం ఇంటికి రావడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అలా అని ఉగాది పచ్చడి తినకుండా ఆపుకోవడం థియరటికల్ గా కూడా సాధ్యం కాదు. గత మూడు సంపత్సరాల నుండి ఉగాది అసలు పుర్తిగా మర్చిపోయాను. ఈసారి ఉత్సాహం ఆగలేదు. ఎలాగైనా ఉగాది పచ్చడి తినాలనే పట్టుదలతో నేనే ఉగాది పచ్చడి చేసాను.

కాని ఉండేది ఫారెన్లో. ఉగాది పచ్చడికి అవసరమయినవి అన్ని దొరకవు. కాని ఏదోలా చేసాను. అది ఇలా తయారయ్యింది.

నా రెసిపి

చేదు కోసం − వేప పువ్వు − ఛాన్సే లేదు − అందుకని వేవవువ్వు బదులు   రేప్ క్రెస్ (rape cress) వాడాను.
ఒగరు − పచ్చి మామిడి − ఎక్కువగా దొరకవు − అందుకని దొరికిన చిలకముక్కు మామిడి వాడాను. (green mango with tangy red bud - these are imported into Britain)
పులుపు − చింతపండు - నేను ఇక్కడ చింతపండు పేస్టే తప్ప దాని అసలు రూపం చుడలేదు - వరైటీగా ఉంటుంది కదా అని నిమ్మకాయ (lemon) వాడాను
తీపి − ఇది బహుతేలక − నేను వాడినవి − పంచదార, తేనె, ఆపిల్ (sugar, honey, apple)
కారం − ఇదీ తేలికే − మామూలుగా ఇంట్లో వాడినట్టు మిరియాలు వాడాను (pepper)
ఉప్పు − మామూలే − ఉప్పు (salt)

మొత్తం ఆరు రుచులు కలిసాయి. ఇవి అన్ని కలిపి పచ్చడి చేసాను. (పచ్చడంటే?... అన్ని నీళ్ళళ్లో ఏసి కలపడం. అంతే!)

అద్భుతం, ఇంట్లో చేసిన్నట్టు రాకపోయినా, వరైటీగా వచ్చింది. కోత్త టేస్ట్!   

మెత్తం తినాలి. అందులోనూ మెదటి ప్రయోగం. ఎందుకైనా మంచిదని నేను ఉండే ఏరియాలో నాకు తెలిసిన ఒకేఒక్క ఇండియన్ ఫామిలి ఉంది (మరాఠీ వాల్లు). వాల్లని పిలిచాను. వాల్లు "చట్టనీ, చట్టనీ" అనుకుంటూ వచ్చారు. అందరం (ముగ్గురం) కలసి తిన్నాం. అంతాక్షేమమే. ఎవ్వరికీ ఏం కాలేదు. ఎట్లీస్ట్ చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి చేసిన "భంగాళా భౌ భౌ" తిని పొట్టి ప్రసాద్ లా "నా ఏనుగుని గుఱ్ఱం మీద తీసుకురండి, దానిమీద అశోకుడితో యుధ్ధం చేసి, టిప్పు సుల్తాన్ తో అడుకొవాలి" అని మాత్రం అనలేదు.

ఏదైతేనేం, మొత్తానికి ఉగాది పచ్చడి తిన్నాను. అదీ ఇంగ్లాండ్లో (నేనుండేది లండన్ దగ్గర ఒక చిన్న టౌను), పైగా నేను సొంతగా చేసింది. చేసినదాంటో కొంచం నా ఇష్ట దైవం బాబాకి కూడా పెట్టాను. అంతా హాప్పీ.

మషిన్ లాగా పరిగెత్తే దైనిక జీవితంలో ఈ చిన్న ఉత్సాహం ఒక పెద్ద మార్పుని మాత్రం తీసుకు వచ్చింది. అదేంటంటే, మనం ఎక్కడున్నా ఏంచేస్తున్నా సంప్రదాయం, దానివల్ల కలిగే ప్రశాంతత ముఖ్యమని తెలుసుకోవడం, అందులో మనకి వీలైనంత భాగం భగవంతునికి అర్పించడం.

మొత్తానికి ఈ విధంగా నా ఉగాది రోజు రాత్రి ముగిసంది.

వి రామా అరవింద్,
2007-03-21, ఉగాది తరువాత రోజు.


[BACK][TOP]

© 2003 - 2011, V Rama Aravind, Vorray, Inc. Site Last Updated: 2011-11-10. Contact Me